Wednesday, August 20, 2025

100/100=35/100

వందకు వంద రావాలి అని పరీక్షల్లో భలే కష్టపడతాము కదా మనమందరమూ.వస్తే మంచిదే!కానీ రాకపోయినా నష్టం లేదు.ముప్పై అయిదు వచ్చినా చాలు.మనము పాసు అయి పై క్లాసుకు వెళ్ళగలము కదా!చాలామంది సెంటమ్ వచ్చిందని విర్రవీగుతుంటారు.అంత అవసరములేదు.ఒక విద్యార్థి వందకు వంద తెచ్చుకునే దానికి ఎన్ని కారణాలు ఉంటాయో అంత కంటే ఎక్కువే కారణాలు ఉంటాయి రాని వాళ్ళకి.తెలివి తేటలు ఉన్నా,కష్టపడే తత్త్వము ఉన్నా చాలా బాధాకరమైన కారణాలు ఉంటాయి.కొంత మందికి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని లాగా ఆ ఇన్క్లినేషను ఉండదు.వంద తెచ్చుకున్నవాడు గర్వానికి పోయి,తర్వాత చతికిల పడవచ్చు.తక్కువ వచ్చినవాడు కష్టపడి,మనసుపెట్టి ముందుకు వెళ్ళవచ్చు.ఒకసారి బరిలోకి దిగిన తర్వాత ముందరి గెలుపులు,ఓటములు వర్తించవు.దేనికదే ప్రత్యేకము.కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా,దిశా నిర్దేశం చేసుకుంటూ ముందుకు పోవాలి.