Wednesday, April 15, 2026
Rolling stone gathers no moss
Rolling stone gathers no moss అని అంటారు కదా!ఒక చోట నిలకడగా లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు ఆస్తులూ,అంతస్తులూ కూడగట్టలేరు అనే అర్థంలో వాడుతారు.మాస్ అంటే నాచు అని అర్థం.ఒక రాయి ఒకేచోట ఉంటే దాని పైన నాచు పెరిగే ఆస్కారం ఉంది.అదే నీటి ప్రవాహంలో ఉండే రాళ్ళు ఆ నీటి ఒరవడికి ఒకచోట ఉండకుండా కదులుతుంటాయి.కాబట్టి ఏ ప్రదేశంలోనూ అవి కుదురుగా ఉండలేవు.అసలు నాచు పెరిగేది దేవుడెరుగు.ఆ రాళ్ళే అరిగి,కరిగి పోతుంటాయి.
సహజంగా ఒకేదాని పైన దృష్టి పెడితే,ఆ రంగంలో మనము నిష్ణాతులం కావచ్చు.కానీ చాలా సార్లు,చాలా మంది వారి ప్రయారిటీస్ డిఫైన్ చేసుకోలేరు.డిసైడ్ చేసుకోలేరు.గాలి వాటంలాగా కనిపించిన ప్రతి ఒక్కదాంట్లో వేలు పెడుతుంటారు.రెండు రోజుల్లో మొహం మొత్తుతుంది.మళ్ళీ క్రొత్త విషయం వైపు దృష్టి మారిపోతుంది.ఇలాంటి వారు జీవితంలో ఏదీ పెద్దగా సాధించలేరు.వాళ్ళ గోల్ ఏందో కూడా ఫైనలైజ్ చేసుకోలేకపోతే,దాని సాథనకు ఏమి కార్యాచరణ చేయగలతారు?కాబట్టి జీవితంలో మనకు ఏమి కావాలో,ఎలా కావాలో,ఎప్పుడు కావాలో నిర్దిష్టంగా ఆలోచించి,కార్యోన్ముఖులం కావాలి.ఎందుకంటే కష్టపడకుండా ఎవరికీ ఏమీ దక్కదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment