చిన్నప్పుడు ఎందుకో ఇంట్లో వాళ్ళ పైన అలిగాను.ఛట్!ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా వుండకూడదని తీర్మానించుకున్నాను ఏక గ్రీవంగా.ఇంట్లోనుంచి బయటకు వచ్చి వీధికొస లో వుండే కొళాయి దగ్గరకు వెళ్ళాను.చాలా సార్లు దాగుడు మూతల ఆటల్లో దాని వెనక దాక్కుంటే ఎవళ్ళూ కనిపెట్టలేదు.కాబట్టి కొళాయి వెనకల కెళ్ళి నిలబడ్డాను.ఐదు నిముషాలు అయింది,పది నిముషాలు అయింది.ఎవరూ నా కోసం వెతుకుతూ రాలేదు.కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి.అన్నం తినే టైమ్ అయింది.ఆకలి అవుతుంది.ఇంత సేపైనా ఎవరూ రాలేదంటే ఇంట్లో ఎవరికీ నేనంటే ఇష్టం లేదనేగా!కాబట్టి అసలు ఇంటి కెళ్ళ కూడదని మళ్ళీ గట్టిగాఅనుకున్నా,కానీ కళ్ళన్నీ ఇంటి తట్టే చూస్తున్నాయి.
అమ్మయ్య!ఇంట్లో నుంచి అన్నయ్య బయటకు వచ్చాడు.వాడు ఇంకో తట్టు పోతున్నాడు.నేను ఇక్కడ వుంటానని తెలుసుకోవాలి కదా!అన్నయ్యకు ఏమీ తెలియదు,వీడితో ఎట్లా వేగేది?ఒక ఐదు నిముషాలు అక్కడా,ఇక్కడా వెతికి ఆఖరుకు నేను వుండే కొళాయి వెనక్కు వచ్చాడు.బుల్లెమ్మా!ఇంటికి పోదాంరా .అమ్మ అన్నానికి పిలుస్తూ వుంది అని చెప్పాడు.కడుపులో మాడుతున్నా సూక్ష్మాలకు తక్కువ లేదు కదా!నేను వెళ్ళి పోతాను.ఇంటికి రాను. నాకుకోపం వచ్చింది అని చెప్పాను.అప్పుడు అన్నయ్య ఇట్లా చెప్పాడు.బుల్లెమ్మా!ఇప్పుడు నువ్వు చిన్న దానివి కదా.నీకు ఆకలేస్తే అన్నం ఎవరు పెడతారు?నిద్ర వస్తే ఎవరు నిద్ర బుచ్చుతారు?కాబట్టి పెద్ద అయిన తర్వాత వెళదాం లే అని ఇంటికి తీసుకెళ్ళాడు.
ఇదే మూర్ఖం అంటే.ఇదే అమాయకత్వం అంటే.అమ్మ ఇంట్లో సవా లక్ష పనులతో సతమతమవుతుంటుంది.క్షణం తీరిక వుండదు.మనం పనికిరాని అనవసరపు విషయాలకన్నిటికీ అలిగేదానికీ రోజంతా ఖాళీనే.గోరంతలని కొండంతలు చెయ్యటంలో సిద్థహస్తులం.మన అమ్మ,నాన్న మనకు మంచి జీవితం ఇచ్చేదానికి అహర్నిశలు పాల్పడతారు.మనకు అవన్నీ ముఖ్యంకాదు.అమ్మ అన్నయ్యకు నెయ్యి ఎక్కువ వేసింది నాకు తక్కువ వేసింది కాబట్టి నేనంటే ఇష్టం లేదు.బాబు అక్కయ్యకు ఇష్టమైన అప్పచ్చులే తెస్తాడు ప్రతిసారీ నాకు ఏది ఇష్టమో అడగడు కాబట్టి బాబుకు నేనంటే ఇష్టం లేదు అని తేల్చేస్తాము. కానీ ఇవన్నీ మనకు పెద్ద విషయాలని వాళ్ళకు తట్టదు,మనం ఆవయసులో చెప్పలేము.కాని ఇప్పుడు తల్లితండ్రులు ఇలాంటి చిన్న చిన్న విషయాలలో బాగా అవగాహనతో వున్నారు.ఇది మంచి పరిణామం.

No comments:
Post a Comment