Friday, January 24, 2025
మారు వడ్డించుకోవాలి
మారు వడ్డించుకోకపోతే అమ్మ పైన ప్రేమ లేనట్టు అట.రాజేశ్వరి చెప్పింది.మొదట తమాషా అనుకున్నాను.కానీ ఆలోచిస్తే నిజమే అనిపించింది.ఈ ప్రపంచంలో అమ్మ దగ్గరే కదా మనమందరమూ ఫ్రీగా,కేర్ ఫ్రీగా ఉండేది.మొహమాటం లేకుండా నచ్చితే,నచ్చిందని చెబుతాము.బాగా లేకపోతే బాగా లేదని చెప్తాము.నచ్చితే ఇంకా ఇంకా పెట్టించుకుంటాము.ఇంట్లో మిగిలిన వాళ్లకి మిగులుతుందో లేదో ఆలోచించము.ఇష్టం లేకపోతే ఎంత బతిమలాడినా వేలుతో కూడా ముట్టము.ఇష్టం అయినవి అడిగి మరీ చేయించుకుంటాము.
అదే బయట అయితే మొహమాటపడతాము.నచ్చినా మళ్లీ అడిగి వేయించుకోము.నచ్చకపోయినా బలవంతంగా తింటాము.బాగుందని కితాబు కూడా ఇస్తాము.అమ్మ చేతి వంటలే కదా మొదట మనం తినేది.ఎవరు ఏమి పెట్టినా,అమ్మ చేసే వంటతో బేరీజు వేసుకుంటాము.అందుకనే అమ్మ అంటే నచ్చుతుంది.అమ్మ చేతి వంట నచ్చుతుంది.అందుకనే అమ్మ చేసింది మళ్లీ మళ్లీ అడిగి పెట్టించుకోని తింటాము.అందుకే మారు వడ్డించుకోకపోతే అమ్మ పైన ప్రేమలేదని,మారు వడ్డించుకుంటే అమ్మ అంటే ఇష్టమని అంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment