Thursday, April 23, 2026
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికినట్లు…
మనము మన జీవితంలో మంచి కోరే వాళ్ళని దూరం పెడతాము.ఎందుకంటే వాళ్ళు స్పైసీ గా ఉండరు.నీబాంచన్ దొరా అన్నట్లు అడుగులకు మడుగులొత్తరు.ఉన్నది ఉన్నట్లుగా,మొహమాటం లేకుండా చెబుతారు.మనకు అట్లాంటి వాళ్ళు ససేమిరా నచ్చరు కదా!
మనము పనికి రాని వాళ్ళని,పస లేని వాళ్ళని వంది మాగధులుగా పెట్టుకుంటాము.ముత్యాల ముగ్గు సినిమాలలో లాగ మనం వెథవ పని చేసినా ఆహా,ఓహో అంటారు.మన మోరల్ బూస్ట్ చేస్తుంటారు.వాళ్ళ వలన మనకు పైసా లాభం లేకపోగా పెద్ద అగాథం.అందుకే అర్హత లేని వారిని అందలం ఎక్కించకూడదు అని అంటారు.పేనును తలలో ఉండనిస్తే ఏం చేస్తుంది?తలంతా కొరికి పెడుతుంది.బరుక్కునే దానికి సమయం సరిపోదు.అందుకే మన సహచరులను,స్నేహితులను ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే మనకు అనవసరపు తలనొప్పులు తీసుకొస్తారు.ఇబ్బందికర పరిస్థితులలో నిలబెడతారు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
👌👌
Post a Comment