Wednesday, December 10, 2025
త్రాగుడు తిరుగుడులను తలదన్నేలా…
మాములుగా మనం త్రాగుడు,తిరుగుడు చెడ్డ అలవాట్లు.వాటిని ఎవరూ ఒంట పట్టించుకో కూడదు అనుకుంటాము కదా!ఇంకో అలవాటు ఉంది.అది చాప క్రింద నీరులా పాకుతుంది.దానికి మనం బానిసలం అయ్యాయని మనకే తెలియదు.తెలిస్తే కదా ఆపేదానికి కానీ తగ్గించుకునేదానికి కానీ ఎవరైనా ప్రయత్నించేది,వారించేది.
అదే విచ్చల విడిగా ఖర్చులు చేయడం.దానిపైన అదుపు లేక పోవడం!అందులో బట్టలు కొనడం ఒకటి.గుడ్డలకు మొహం వాచినట్లు కొంటుంటారు!విండో షాపింగ్ ఓకే.కానీ షాపింగ్ ప్రక్రియలో వీరవిహారం చేయడం ఇంకో లెవల్!
వీరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకూ ఏదో ఒక కారణంతో వాళ్ళ వార్డ్ రోబ్ చూపిస్తుంటారు.లేదంటే సినిమాలలో పాటలలో హీరోయిన్స్ డ్రెస్సులు మార్చినట్లు గంటకో చీర మారుస్తుంటారు.వీటికి తోడు యాక్సెసరీస్ మార్చడం.పొద్దున లేచి ఇదే వ్యవహారం.ఇంక పెళ్ళిళ్ళూ,పేరంటాలూ అయితే,పెళ్ళికూతురు కంటే వీళ్ళే ఎక్కువ డ్రెస్సులు మారుస్తూ వాళ్ళ టాలెంటు,టేస్టూ అందరికీ పరిచయం చేస్తుంటారు. అయ్యో!అనిపిస్తుంది.ఎంత సమయం వృథా చేస్తున్నారు అనిపిస్తుంది.ఎవరి పిచ్చి వాళ్ళకానందంలే అని నవ్వుకోవాలి మనం.అంతే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment