Tuesday, December 16, 2025
Expectations…ఆకాశపుటంచులు దాటి…
మాములుగా మనము ఎవరికైనా ఏమైనా చేయాలి అంటే మన ఆలోచనా సరళి ఎలా ఉంటుందంటే....
వీళ్ళకి ఎంత చేసినా ఒకటే!ఎవ్వరూ మనకు భుజకీర్తులు,కీర్తి కిరీటాలు పెట్టరు.అంత దానికి ఒళ్ళించుకుని పడీ పడీ చేయటం శుద్థ దండగ.గమ్మున ఉంటే కనీసం అలవకుండా అన్నా ఉంటాము.
అదే ఇంకెవరు అయిన మనకు సహాయము చేసేదానికి వచ్చారు,అనుకో,నీకు మేమున్నాము అంటూ....
అప్పుడు మన మానసిక పరిస్థితి...
ఓ అని ఎగేసుకోని వచ్చారు సహాయం చేస్తామని.ఏ మాత్రం చేస్తారో అదీ చూస్తాం.మనం హాచ్ అని తుమ్మినా మన ముక్కు కూడా వాళ్ళే తుడవాలి అనుకుంటాము.చాలా సార్లు అన్ డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటాము.వాళ్ళేమో ఎరక్క పోయి వచ్చాము,ఇరుక్కు పోయాము అని పాడుకునేలా చేస్తాము.
వాళ్ళ సిన్సియారిటీని అనుమానిస్తాము,అవమానిస్తాము.ఎందుకంటే ఎవరూ,ఎవరినీ పూర్తిగా బయట పడవేయలేరు ఇబ్బందుల్లోంచి.ఒకరు మాట సహాయం చేస్తారు,ఒకరు ధైర్యం చెబుతారు.ఇంకొకరు మన పనిలో సహాయ పడతారు.కానీ మనం ఇంకా చాలా కోరుకుంటాము వాళ్ళనుంచి.దాని వలన అసంతృప్తి కలుగుతుంది మనకు.వాళ్ళకు ఏమో వీళ్ళకు ఎంత చేసినా తృప్తి లేదు అని అసహనం పెరుగుతుంది.
చాలా మటుకు అంత చేస్తాం,ఇంత చేస్తాం అని మాటలు చెప్పి,తరువాత ప్రక్కకు తప్పుకునే వాళ్ళే ఎక్కువ.వచ్చిన ఒకరు,అరను మన మాట తీరుతో,ప్రవర్తనతో గాయపరుస్తాము.ఆ గ్రాటిట్యూడ్ చూపించడం ముఖ్యం.నిజానికి కొన్ని సార్లు కొంత మంది చేసే సహాయం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము.మన సంతోషాన్ని వారికి వ్యక్తపరచాలి మనము.వారికి అవసరము వచ్చి నప్పుడు అడగకుండానే పలకాలి.
సర్వే జనాః సుఖినో భవంతు అంటే అందరమూ ఒకరికొకరు సహాయంగా ఉండాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment