Tuesday, June 23, 2026
స్టూడెంటు ట్రైనీతో సినిమాకు
మా అబ్బాయి నెలల పిల్లవాడు.అత్త బయట ఉంటే బిడ్డను తీసుకోవడం,ఆడించడం చేసేది కాదు.ఓహో!అలాగా!అనుకున్నాను.
మా బాంకులో అప్పుడు ఒక అమ్మాయి,పేరు నాగమణి అనుకుంటా,ఉండేది.అప్పట్లో సమ్మర్ వెకేషవ్లో మంచి స్టూడెంట్స్ ఒకరిద్దరిని స్టూడెంటు ట్రైనీస్ గా తీసుకునే వారు.వారిని వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ రెకమెండ్ చేసేవారు.మంచి స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ బెనిఫిట్,బాంకింగు పైన ఇంటరెస్టు కలిగించేదానికే అనుకుంటాను.ఆ ట్రైనీస్ నిజమయిన ఫైనాన్షియల్ డీలింగ్లు చూడరు.జస్ట్ బాలన్సింగు పనులు,టపాల్ సెక్షన్ లో పనులు చేసేవారు.
ఆ అమ్మాయి అక్కా!అక్కా!అంటూ నా చుట్టూరా తిరుగుతుండేది.ఒకసారి అత్త నన్ను బిడ్డను తాకనివ్వదేమో అని ఆ అమ్మాయితో సినిమా ప్రోగ్రాము పెట్టుకుని ఇంటికి వచ్చాను.ఇంటికి రాగానే ముఖం కడుక్కుని,సినిమాకు పోతున్నాను,అత్తా అని చెప్పేసి సినిమాకు వెళ్ళిపోయాను.ఇంటికి రాగానే అత్త వివరించింది.అమ్మాయి!బిడ్డలకు సిడిగా ఉంటుంది అని వేరేవాళ్ళు ఎత్తుకోరు.నీవు కన్న తల్లివి కదా!కాబట్టి నీ బిడ్డను నీవు దగ్గరకు తీసుకోవచ్చు.దానికి ఏమీ మైల ఉండదు అని చెప్పింది.అంత మబ్బు శిఖామణిని నేను.లోకజ్ఞానం శూన్యంగా ఉండేదాన్ని.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment