Monday, June 29, 2026
అత్యద్భుతం అగ్నిపర్వతం!
నిన్న పిల్లలు హవాయిలోని బిగ్ ఐలాండులోని అగ్ని పర్వతం దగ్గరకు తీసుకెళ్ళారు.వెళ్ళే దారి అంతా గడ్డలు కట్టిన లావా రాళ్ళు.మేమున్న చోటి నుంచి సుమారు మూడు గంటల ప్రయాణం.1974 లో ఒకసారి ఎరప్ట్ అయిందట!దానికి సంబంధించిన లావా అది.అక్కడ అంతా అక్కడక్కడ పొగలు వస్తూ ఉన్నాయి.నాకు అయితే సల్ఫర్ వాసన తెలియలేదు కానీ సన్నగా వస్తుంది అన్నారు పిల్లలు.స్టీమ్ వెంట్ అని అక్కడక్కడ పొగలు.దగ్గరికి పోతే కొలిమి దగ్గర మనం మొహం పెట్టినట్లు ఆవిరులు!
లావా ట్యూబు అనే చోటికి వెళ్ళాము.అక్కడ నుంచి అంతకు ముందు లావా బయటకు తన్నుకు వచ్చిన టన్నెల్.లోపలకు వెళ్ళి చూసాము.నిన్న పౌర్ణమి.సాయంత్రానికి అసలు వాల్కనో దగ్గరకు వెళ్ళాము.ఎంత పెద్ద క్రేటరో!రెండు రోజుల ముందే లావా బయటకు ఎగిసిందట!పొగలు వస్తున్నాయి.చీకటి పడేదాకా ఉన్నాము.ఒక తట్టు ఆకాశంలో పున్నమి చంద్రుడు.ఇంకో తట్టు ఆ అగ్ని పర్వతం నుంచి మంటలు ఎగబాకడం!రెండు కళ్ళు చాలలేదు ఆ అద్భుతమయిన దృశ్యం చూసేదానికి.ఆ క్రేటరు లో మోల్టెన్ లావా!నిజంగా జీవితం ధన్యమనిపించింది.ఒక లైవ్ వాల్కనో చూస్తాను అని ఎప్పుడూ కలగన లేదు కూడా నేను.ప్రకృతి పరమయిన అద్భుతాలు కదా!మనముందు ఆవిష్కృతము అవడం,పండు వెన్నెలలో ఆఅందాన్ని ఆస్వాదించ గలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.నన్ను ఓపికగా తీసుకెళ్ళి అవన్నీ బిడ్డలు చూపించడం నాకు ఇంకా హాయినీ,సంతోషాన్ని కలగచేస్తున్నది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Great experience 👏
Post a Comment