ఈ రోజు కృష్ణాష్టమి . కృష్ణుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం . ఈ పండగ మనకంటే అరవం వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు . చిన్నప్పుడు మా ఫ్రెండ్ రాధ వుండేది . వాళ్ళు తమిళ్ బ్రాహ్మలు . వాళ్ళ అమ్మ ఈ పండుగకు కృష్ణుడి పాదాలు వీధి వాకిటి లోనుంచి వేసుకుంటూ వెళ్లేది . ఆ రోజు చాలా రకాల పిండి వంటలు చేసేది .
మా ఇంట్లో ఈ పండగ అంత బాగా చేసేవాళ్ళు కాదు . మళ్లీ నా పెళ్లి అయిన తరువాత మా అత్త అలా చేసేది . నేను తరువాత వేరే ఊళ్లకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ,పిల్లలు చిన్నగా వుండే ట ప్పుడు చేసేదాన్ని . కాని పిల్లలు పెద్ద క్లాసు లకు వచ్చి న తరువాత తగ్గించాను .
మా అమ్మ వాళ్ళు పూజలు చేస్తారు కాని మా అత్త వాళ్ళు పూజలు పునస్కారాలు ఎక్కువ . మా అత్త దగ్గర అయితే వెయ్యి పేజీల పాటల పుస్తకం వుంది . ఏ పేరంటానికి వెళ్ళినా అడిగితే చాలు చాలా పాటలు పాడుతుంది . నాకు భగవద్గీత అంటే ఇష్టం . చిన్నప్పుడు మా బాబు ఎప్పుడు చదివే వాడు . నాకు అప్పటి నుంచే అలవాటు అయింది .
నా కష్ట కాలం లో అంతా మనసు బాగా లేక పోతే భగవద్గీత చదువుకునేదాన్ని .
కృష్ణుడు పుట్టిన రోజంటే కన్న తల్లులకు ,పెంచిన తల్లులకు అందరికి కూడా పండగే . బిడ్డల పండగ అంటే హడావుడి అంతా అమ్మ లదే కదా ఎక్కడైనా !
కృష్ణుడు తల్లుల గౌరవం పెంచాడు . ఎందుకంటారా !చెరసాలలో మగ్గి కూడా ,దేవకీ వసుదేవులు బిడ్డను కాపాడుకొన్నారు . పెంచిన తల్లి అయినా యశోద కన్నా తల్లిని మరిపించేలా మురిపించి పెంచింది బాల కృష్ణుడిని . ముల్లోకాలను ఏలే దేవుడు అయినా వాళ్లకు కన్న బిడ్డే కదా కదా,చిన్న బిడ్డే కదా!!!!
1 comment:
తెలుగు లొ వ్రాయడం వల్ల ఈ టపా ఇంకా బాగుంది.ప్లీస్ కీప్ ఇట్ అప్.
Post a Comment