Tuesday, October 15, 2024
ఏక భుక్తం భూశయనం
మా చిన్నప్పుడు మా బాబు(నాన్న)ఎప్పుడూ చెప్పేవాడు.బ్రహ్మచర్యం నిష్టగా పాటించేవాళ్ళు ఏకభుక్తం భూశయనం తప్పకుండా ఆచరించాలిఅని.పెళ్ళి కాని వాళ్ళు చదువుకునే వాళ్ళు తాంబూలం వేసుకోకూడదు అని.ఏమీ లేదు.సుగంథ ద్రవ్యాలు వాడకూడదు అని.నాలుక మొద్దుబారిపోతుంది.ఉచ్ఛారణ సరిగ్గా వుండదు అని.ఏక భుక్తం అంటే ఒంటి పూట భోజనం అని అర్థం.భూశయనం అంటే పరుపులు అవి లేకుండా కటిక నేల పైన పండుకోవాలి.ఇలా కఠినంగా,క్రమశిక్షణగా వుంటేగానీ చదువు వంట పట్టదని పెద్దల నమ్మకం.
ఇప్పుడు అలాంటి పద్థతులు లేవు,ఎవరూ పాటించరు.
ఏక భుక్తం అంటే సుమారు ఈ రోజు మథ్యాహ్నం భోజనం చేస్తే ,మళ్ళీ రేపు అన్నం తినేదాక ఏమీ తినకూడదు అని.అంటే ఒక్కపొద్దు వున్నట్లే కదా!
ఇప్పుడు చాలా మంది అది పాటిస్తున్నారు కొంచెం మార్పులు చేర్పులతో.16 గంటల ఫాస్టింగ్ అంటారు.8గంటలు ఏమైనా తినవచ్చు,ఎంతైనా తినవచ్చు.కానీ ఆఖరున తిన్నప్పటినుంచి 16 గంటలు ఏమీ తినకూడదు.
ఇంకా కొంతమంది కొన్ని రోజులు అనుకుని నీళ్ళు మటుకే తాగుతారు.ఒక్క పొద్దు వుండటం ఒంటికి మంచిది అని తెలుసుకున్నారన్న మాట.మన పెద్దలు చెప్తారు కదా...లంఖణం దివ్యౌషథం అని.
వీపు పట్టుకున్నా,మెడ పట్టుకున్నా,నడుము పట్టుకున్నా,నేల పైన పండుకుంటే తగ్గుతాయి కదా.అంటే భూశయనం మంచిదే కదా!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment