Thursday, October 24, 2024

లెక్కలేనితనం మానుకోవాలి

మనం ప్రతి ప్రాణికీ విలువ ఇవ్వాలి.మనమొక్కటే కాదుకదా ఈ భూమిపైన వుండేది?వాటి హక్కులని మనం కాలరాయకూడదు కదా!జంతువుల గురించే అలా మంచిగా మాట్లాడుకుంటున్నప్పుడు సాటి మనుష్యుల గురించి ఇంక ఎంత మంచిగా ఆలోచించాలి?కానీ చాలా చోట్ల పక్కవాళ్ళను కీతాగా చూడటం,అవమానించడం,హింసించడం,లెక్కలేనితనంగా వ్యవహరించడం చూస్తుంటాము.ఎదుటివాళ్ళను మనుష్యులుగా,మనకు సమానంగా చూడటం నేర్చుకోవాలి.మనల్ని చూసేకదా మన బిడ్డలు నేర్చుకుంటారు.వాళ్ళకు మనం మంచిగా విలువలు నేర్పించాలి కదా.ఎదురుతిరగలేనివాళ్ళు,అశక్తులు,చిన్నవాళ్ళు,బీదవాళ్ళు,సంఘంలో పెద్ద పేరుప్రతిష్ఠలులేనివాళ్ళు,అబలలు...వీళ్ళను పీడించడం గొప్ప అనుకునే వర్గం వుంది.ఆ భావజాలం నుంచి అందరూ బయటపడాలి.మనం ఎదుటివాళ్ళకు గౌరవమర్యాదలు ఇస్తేనే వాళ్ళు మళ్లీ తిరిగి మనకు ఇస్తారు.భయంతో మనమాట వినటం గొప్ప కాదు.మనమీద ప్రేమతో,గౌరవంతో మన మాటలకు విలువ దక్కేటట్లు చూసుకోవాలి మనం ఎప్పుడూ.నోటి దురుసు తగ్గించుకోవాలి.తప్పు జరిగితే చిన్నగా అర్థం అయ్యేటట్లు చెప్పి,ఆ తప్పు సరిదిద్దుకునేటట్లు చెయ్యాలి.ఊరికినే అరవటం,కొట్టటం,దూషించటం,కించపరచడం,వ్యంగ్యంగా మాట్లాడటం,తక్కువ చేసి మాట్లాడటం,ఎద్దేవా చేయటం మానుకోవాలి.అందరితో మంచిగా ఉండాలి.సర్దుకుని పోతూండాలి.చిన్నదానికి పెద్దదానికి ఘర్షణలు,గొడవలు మానుకోవాలి.చిన్నా పెద్దా అంతరం గుర్తించాలి.మన మాటలు,చేతలు,ఆలోచనలు ఎప్పుడూ లెక్కలేనితనంగా,ఎదుటివారిని బాధపెట్టే విధంగా,భయపెట్టేవిధంగా ఉండకూడదు.

No comments: