Monday, October 28, 2024
తప్పులెన్నువారు……కానీ
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అని అంటారు.నిజమే!తప్పేముంది?నేను ఉన్నాను.రోజులో నా మొహం రెండు లేక అయిదు నిముషాలు చూసుకుంటాను.రోజు మొత్తం వేరే వాళ్ళనే చూస్తూంటాను,వాళ్ళ మాటలు వింటుంటాను,వాళ్ళ చేతలు చేష్టలు గమనిస్తుంటాను.కాబట్టి వాళ్ళని విశ్లేషణ చేయటం నాకు సులభం.నా గురించి ఆలోచించడానికి అసలు సమయం ఎక్కడ మిగిలింది ఇంక?కానీ ఇక్కడే మనం కొంచెం ఆగి మన గురించి ఆలోచించుకోవాలి.మనం ఎంత సేపూ ఎదుటివాడు గులకరాయి తగిలి తట్టుకున్నాడు అని మందలిస్తాము.కానీ మనం పెద్ద బండరాయి కొట్టుకుని బోళ్ళ పడతాము.ఎదుటివారి తప్పొప్పులు,లోటుపాట్లు క్షుణ్ణంగా చెప్పగలతాము.మనం చాలా నిఖార్సు అయిన మనుష్యులం,మనం అసలు తప్పులు చేయమని గుడ్డి నమ్మకం.ఒక వేళ తప్పు జరిగినా మనల్ని మనం సమర్థించుకునేదానికి సవాలక్ష కారణాలు చెప్తాము.కారణాలు అంబులపొదిలోనుంచి అస్త్రాలు వచ్చినట్లు వస్తాయి.ఈ అతి మనమందరమూ మానుకోవాలి.ఆత్మ శోధన అప్పుడప్పుడు అన్నా చేసుకుంటూ ఉండాలి.మనం తప్పులు చేసుకుంటూ పోతే,పక్కవాళ్ళకి మంచి చెడ్డ ఏమీ చెప్పగలతాము?కాబట్టి ఎదుటి వాళ్ళలో తప్పులను వేలు ఎత్తి చూపించే ముందు మనం ఏ పాటి పద్ధతి గలవాళ్ళమో బేరీజు వేసుకోవాలి.వాళ్ళ పరిస్థితిలో ఉంటే మనం ఎలా వ్యవహరించి ఉంటాము అనే జ్ఞానం మనకు ఉండాలి.ముందు క్షమాగుణం ఉండాలి.ఎదుటి మనిషిని అర్థం చేసుకునేదానికి నిజంగా ప్రయత్నించాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment