Sunday, November 16, 2025

మంచె మీద మంచి పుస్తకాలతో

నేను ఆరో తరగతిలో ABCDలు నేర్చుకున్నాను.ఏడో క్లాసుకి వచ్చేటప్పటికి ఇంగ్లీషు అంటే ఇష్టం పుట్టింది.ఎండా కాలం సెలవుల్లో చుట్టు పక్కల ఇండ్లు తిరిగి పెద్ద క్లాసు పిల్లల నాన్డిటైల్సు,ప్రైజు పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని.అలా చదివినవే...coral island,treasure island,westward ho,kenilworth,tombrown school days,oliver twist,david copperfield... మా పెద్దన్నయ్యకు పుస్తకాలు అంటే ఇష్టం.కొన్ని కొనేవాడు.తొమ్మిదో క్లాసు సెలవుల్లో Emma,Sven hassel world war series.ఇంక ఆ ప్రస్థానం అలా కొనసాగింది.emesco పుస్తకాలు చదివాను.readers digestlo వచ్చే abridged editions చదివేదాన్ని.వాటిల్లో roots నాకు బాగా నచ్చింది. కాలేజీకి వచ్చిన తరువాత రెచ్చిపోయాను.mills&boon అయితే వందలు,వేలలోనే!harold robbins,denise robins,barbara cartland,hermina black..నేను చదివిన మొట్ట మొదటి తెలుగు నవల సెక్రటరీ. పెద్దక్కయ్యకు పెళ్ళి అయిన తరువాత ఎండా కాలం సెలవులకు అక్కడకు వెళ్ళాను.అక్కడ arthur donnan coyle వి perry mason series,james hadly chase series,james bond series ఔపోసన పట్టేసాను. కాలేజీలో వెనక బెంచీలో కూర్చుని చదివేదాన్ని BSC,Mscలలో.అమ్మకు తెలియకూడదని కథల పుస్తకాలకు అట్టలు వేసి ఇంట్లో చదివేదాన్ని. Arthur haileys airport,hotel,final diagnosis...strong medicine... pearl s buck good earth,concubine.. Emily bronteS wuthering heights...నన్ను చాలా కదిలించింది.మన దేవదాసు నవల లాగా అది చదివిన చాలా రోజులు మామూలు కాలేకపోయాను. mario puzos godfather 1&2,henry charrieres papillon,robert ludlum novels,scarlet letter,gone with the wind,dark of the sun,love camp,second lady by Irving wallace,Ayn rand fountainhead...ఇలా ఎన్నో,ఎన్నెన్నో... arun joshi,Sasti bratas..my god died young...I take this woman by rajinder singh bedi harleQuin romances.... నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది.మంచె మీద బాగా సర్దుకుని కూర్చోవాలి.ఒక తట్టు చదివిన పుస్తకాలు,ఇంకో తట్టు చదవాల్సిన పుస్తకాలు ఉండాలి.ఆకలి అయితే తినేదానికి చేతికి తడి,నూనె అంటకుండా ఉండే తినుబండారాలు ఉండాలి.మంచి నీళ్ళు పక్కనే ఉండాలి.ఎవళ్ళూ నన్ను గలభా చేయకుండా ప్రశాంతంగా చదువుకోగలగాలి. ఇప్పుడు ఒక రకంగా కుదిరింది..కానీ కొన్ని మార్పులూ చేర్పులతో!మంచె కాస్తా మంచం అయింది.కథల పుస్తకాలు కాకుండా దేవుడి పుస్తకాలు చేరాయి.

No comments: