Friday, November 7, 2025

పాపం భీష్ముడు

తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని అంటారు కదా!అలానే అపాత్ర దానం చేయకూడదు అని కూడా అంటరు కదా!నాదృష్టిలో భీష్ముడు ఈ రెండు తప్పులూ చేసాడు. చెట్టంత ఎదిగిన కొడుకు ఉండి స్త్రీవ్యామోహానికి గురి అయిన తండ్రికి కొడుకుగా పుట్టడం!అదేందో మహాయజ్ఞమో,యాగమో అన్నట్లు దానికోసరము కఠోరమయిన బ్రహ్మచర్యం పాటిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేయడం! ఇలా చేసి ఎవరికి,దేనికి మార్గ దర్శకము అయినట్లు! ఇంతా చేసి ఏమైనా సుఖ పడ్డాడా అంటే అదీలేదు. అంత జ్ఞానము ఉండి ధర్మం వైపు నిలబడ్డాడా అంటే అదీ లేదు.పాండవులు మంచి వారని తెలిసినా,ధర్మమార్గంలో ఉన్నారని తెలిసినా కౌరవుల పక్షమే నిలిచాడు.నాకైతే ఈయనకు ఇంకో రకం అంధత్వం...అన్నీ కనిపించినా,తెలిసినా ఏమీ చేయలేని అశక్తత!

No comments: