Friday, July 3, 2026
అలాస్క ఎయిర్ లైన్న్…అందమయిన అనుభూతి
మొన్న వైట్ సాండ్ బీచ్ కి వెళ్ళాము.అక్కడ ఇసుక చాలా ఫైన్ గా ఉంది.పిండిలాగ మెత్తగా ఉంది.నీళ్ళు గ్రీనిష్ బ్లూ గా భలే ప్లెసెంట్ గా ఉన్నాయి.షాలో వాటర్స్ అయి,బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువగా ఉంటే నీళ్ళు ఆరకంగా కనిపిస్తాయి.సముద్రము లోతు పెరిగే కొద్దీ లైట్ బ్లూ,డీప్ బ్లూ గా కనిపిస్తుంది.సముద్రం ని రత్న గర్భ ఇంటారు కదా!నిన్న నీరెండకు నీరు మెరుస్తూ,అల్లంత దూరం నుంచీ రత్నాల దుప్పటి పరుచుకున్నట్లు మెరిసిపోతూ ఉణ్ణింది.
ఇక్కడ గ్రీన్ సాండ్ బీచ్ కూడా ఉందట.మాకు కుదరలేదు.అక్కడకు చేరడం కొంచెం కష్టం అనుకున్నారు.
నిన్న మా తిరుగు ప్రయాణం.A-Bays అనే చోట బ్రేక్ఫాస్ట్ చేసాము.నేను వెనీలా ఫ్లేవర్డ్ యోగర్ట్ విత్ బ్లూ బెర్రీస్,స్ట్రా బెర్రీస్ తీసుకున్నాను.వచ్చేటప్పుడు అర్థరాత్రి దిగాము కాబట్టి అర్థం కాలేదు.పగటి పూట చూస్తే ఎయిర్ పోర్ట్ భలే డిఫరెంట్గా కనిపించింది.మొదటి సారి నేను అలాంటి ఎయిర్ పోర్టు చూడడం!అంతా ఓపన్ గా ఉంది.ఏదీ క్లోస్ గా లేదు.బాగేజ్ క్లైమ్,గేట్స్ అన్నీ!ఒక రకంగా చెప్పాలంటే వసారాలు ఉంటాయి కదా పల్లెలలో ఇండ్లలో .జస్ట్ రూఫ్..।నాలుగు తట్లూ తెరిచి ఉంటుంది ప్రతి చోటా.నిజానికి మా గేటు దగ్గరకు వెళ్ళి కూర్చుంటే ఎదురుగా వీథి,వెనకాలే విమానం,ప్రక్కనే విశాలంగా సముద్రమూ కనుపిస్తున్నాయి.అక్కడ నేటివిటీ,లోకల్ టచ్,వెదర్ కండిషన్స్ కి అలా వెరైటీగా కట్టారేమో అనిపించింది.
అక్కడ గోడల పైన కూడా ఒక ఫోక్ లోర్ కనిపించింది.ఆ దీవికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారట!ఒక అమ్మాయి అక్కడక్కడా నివసించేదానికోసరము మంటలు వేసిందట!కానీ చెల్లెలు ఆ మంటలనన్నిటినీ ఆర్పుతూ వచ్చింది అట!కానీ మొత్తానికి అక్క అక్కడ నివాసం ఏర్పరుచుకుంది.మంటలు ఆరిపోకుండా కాపాడుకుంది.
అలాస్క ఎయిర్ లైన్స్ లో ఎక్కాము.ఆ ఎయిర్ హోస్టెస్ లు నన్ను చాలా బాగా చూసుకున్నారు.ఒక రకంగా చెప్పాలంటే పామ్పర్ చేసారు.నన్ను ట్రిప్ బాగా జరిగిందా?ఏమేమి చూసావు?ఏది బాగా నచ్చింది?అని అడిగారు.ఇద్దరు ముగ్గురు ఎయిర్ హోస్టెస్సులు అటు,ఇటూ తిరిగేటప్పుడు నన్ను చూసి నవ్వడము,భుజం పైన తట్టడం చేస్తూ ఉన్నారు.అందులో ఒక ఆమె అయితే వచ్చేసేటప్పుడు హగ్ చేసుకుని,బై చెప్పింది.నాకు చాలా మంచిగా అనిపించింది.
నేనూ ముప్పై అయిదు ఏళ్ళపైన సర్వీసు చేసాను.వికటాట్టహాసాలు చేసుంటానేమో కానీ,మందస్మిత...సుస్మిత లాగ ఎప్పుడూ బాంక్ కస్టమర్లను రిసీవ్ చేయలేదు.రెండేళ్ళ క్రితం కూడా Air France airlines లో కూడా ఇలాగే మంచిగా ఉణ్ణారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment