చిన్నప్పుడు నాకు సంపూర్ణ అనే ఫ్రెండ్ వుండేది.ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాను .ఆ అమ్మాయి చాలా మంచిది.కానీ తన దగ్గరకువెళ్ళగానే ఘాటుగా వాసన అనిపించేది.తర్వాత దానిని బాడీ ఓడర్ అంటారని తెలిసింది.అది నచ్చక ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేసాను.అలా చెయ్యటం తప్పని అప్పట్లో తెలియదు.ఇప్పటికీ నాకు ఆ విషయమై గిల్టీ గా వుంటుంది.తర్వాత తర్వాత మా పిల్లలు అమ్మ వాసన నాన్న వాసన అనేవాళ్ళు.మన శరీరం నుంచి చాలా మైల్డగా వాసన వస్తుంది.అది చిన్నప్పుడు బాగా తెలుస్తుంది.అప్పుడు ఘ్రాణ శక్తి బాగుంటుందేమో పెద్దయ్యాక కంటే.
వంటలు చేసేటప్పుడు భలే వాసనలు వస్తాయి.కానీ నేను కనుక్కున్నదేంటంటే వంటల్లో ఉప్పు తక్కువ అయితే వాసనలు బాగా వస్తాయి.ఒక సారి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది.అప్పటి నుంచి ఒక ఆరు నెలల దాకా కాఫీ వాసన తగిలితే కడుపులో తిప్పేది.ఆఖరకు ఎట్లా అయ్యాను అంటే కాఫీని కళ్ళతో చూసేదానికి భయపడేదాన్ని.
ఒక సారి ఒక పార్టీకి వెళ్లాము.అక్కడ చాలా రకాల డ్రింక్స్,జ్యూస్ లు వున్నాయి.అందరూ మామిడిరసం తాగుతున్నారని నేను కూడా తెచ్చుకున్నాను.అది నోటి దగ్గరకు తీసుకెళుతుంటే ఘాటుగా వాసన వచ్చింది.ఆవాసనకు మళ్ళీ కడుపులో తిప్పటం.షరా మామూలు.నేను అది నా ఒక్క ఇబ్బంది అని తెలుసుకోలేక పోయాను.మా అమ్మాయిని పిలిచి అది చెడి పోయినట్లుంది.అందరికీ తాగొద్దని చెప్పు అని అన్నాను.కానీ మా పిల్ల ఎవళ్ళకీ చెప్పినట్లు లేదు.తర్వాత గమనిస్తే అన్నిటికంటే అదే ఎక్కువ తాగారు.
దీని పట్టి ఏమి అర్ధం అవుతుంది?మన ఆలోచనలు,మన భావాలు,మన రుచులు,మన ఇష్టాయిష్టాలు అందరికీ నచ్చాలని లేదు.ఎదుటి వాళ్ళకు నచ్చింది మనకు నచ్చాలని లేదు.అంత మందికి నచ్చిన పళ్ళరసం నాకెందుకు కడుపులో తిప్పింది?
ప్రతి విషయాన్ని గ్రహించటంలో మన దృష్టి కోణం,మన అవగాహన,మన జ్ఞానం,మన అజ్ఞానం,మన పరిధి,మనం పుట్టి పెరిగిన వాతావరణం,ఇలా చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి.కాబట్టి మనం చెప్పిందే వేదం,అందరూ అది ఒప్పుకోవాలి అనుకోకూడద.అలా అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకెవరూ వుండరు.

No comments:
Post a Comment