Tuesday, July 28, 2026

ప్రైజ్ కప్పులు దేవుడి ముందర

మూడో క్లాసు చదివేటప్పుడు మా అయ్యవారు నన్ను శుభ్రత,పరిశుభ్రతకు రెప్రజెంటేటివ్ ను చేసాడు.అప్పట్లో ఆ పదాలకు కరెక్టు స్పెల్లింగ్ కూడా తెలియదు.నా పని ఏంటంటే మిగిలిన పిల్లలు బడికి శుభ్రంగా తల దువ్వుకుని వస్తున్నారా?గోళ్ళు కట్ చేసుకుని,మట్టి లేకుండా ఉంచుకుంటున్నారా అనేది చెక్ చేయాలి.ఒకరోజు సడెన్ గా ఆయనే అందరినీ వరుసలో నిలబెట్టి చూసాడు.గోళ్ళు పెరిగిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇంక నాకు భయం అరుస్తాడేమోనని.గోళ్ళు కనిపించకుండా పిడికిలి బిగించాను.ఏమే పద్మా!నీ గోళ్ళు బాగున్నాయా అని అడిగాడు.నోట్లో మాట రాకుండా తల ఊపాను.అలా ఆ రోజు తప్పించుకున్నాను. స్కూలులో కాంపిటీషన్ అని చెప్పకూడదు.ముందర నా పేరు చెప్పేస్తాను.అది నాకు రానీ,రాకపోనీ...నాకు సంబంథం లేదు.అట్లా స్కిప్పింగ్ లో ఫస్ట్ ప్రైజ్,డాన్సులో ఫస్ట్ ప్రైజు,సంస్కృతం రెసిటేషన్ లో ఫస్ట్ ప్రైజు,ఇంగ్లీషు రెసిటేషన్ లో సెకండ్ ప్రైజు వచ్చాయి.ప్రైజుగా చిన్న చిన్న గంథం గిన్నెలు లాగ మూత ఉండేవి ఇచ్చేవాళ్ళు.మా అమ్మ వాటిని దేవుడి దగ్గర పసుపు,కుంకుమ,అక్షింతలు వేసి పెట్టేది.ఆరో క్లాసులో సైన్సు మేడమ్ స్టీలు స్పూను ఇచ్చింది ఫస్ట్ వచ్చానని. కాలేజీకి వచ్చిన తరువాత ప్రైజులు రాలేదు.కానీ హిందీ డిపార్ట్ మెంటు రెప్రజెంటేటివ్ అయ్యాను.హైయెస్ట్ స్కోరు వచ్చిన వాళ్ళకు ఆ పోస్ట్ ఇస్తారు.స్టూడెంటు రెప్రజెంటేటివ్ గా ఫాకల్టీ అండ్ కాలేజ్ అడ్మిన్స్చ్రేషన్ సెలెక్ట్ చేసింది.M.Scలో గర్ల్స్ రెప్రెజెంటేటివ్ ను అయ్యాను.అక్కడ కూడా హైయెస్ట్ స్కోరు వచ్చిన వాళ్ళను నామినేట్ చేస్తారు.ఇవన్నీ అప్పట్లో ఎవరికి,ఎప్పుడు,ఎలా చెప్పాలో తెలియదు.నిజానికి మా అమ్మా వాళ్ళకు కూజా తెలియదు.అంత అయోమయంగా ఉండేదాన్ని.

No comments: